![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమోనే ఇంత రొమాంటిక్ గా హాట్ గా ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఎలా ఉంటుందో అనిపిస్తోంది. రీసెంట్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఈ ప్రోమో మొత్తం రొమాంటిక్ డైలాగ్స్ తోనే ఉంది. ఇక ఈ షోకి "ఉస్తాద్" మూవీ టీమ్ నుంచి ప్రొమోషన్స్ లో భాగంగా శ్రీ సింహ, కావ్య వచ్చారు. గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, నాగ పంచమి సీరియల్స్ హీరోహీరోయిన్స్ వచ్చారు అలాగే రవికృష్ణ-నవ్య స్వామి ఎంట్రీ ఇచ్చారు. క్యూట్ గా ఉన్న కపుల్ గా బ్రహ్మముడి సీరియల్ నుంచి మానస్-దీపికను నిలబెట్టింది శ్రీముఖి. రొమాంటిక్ జోడిగా నాగపంచమి సీరియల్ హీరోహీరోయిన్స్ నిలబెట్టింది. ఇక దీపికకు కోపం వచ్చేసింది "ఎందుకు నన్ను క్యూట్ సైడ్ పెట్టారు. నేను రెయిన్స్ లో ఫస్ట్ నైట్ చేస్తాను..ఎందుకు నన్ను రొమాంటిక్ సైడ్ పంపలేదు" అని అడిగింది.
తర్వాత గుప్పెడంత మనసు టీం వచ్చింది. ఇక సీరియల్ హీరో రిషిని చూసేసరికి శ్రీముఖి అలిగి బుంగమూతి పెట్టింది దానికి రిషి సర్ బుజ్జగిస్తూ "చేస్తోంది గుప్పెడంత మనసు కానీ నా మనసంతా మీరే ఉన్నారు .. రక్షా అప్పుడప్పుడు అంతే.. బోర్ కొట్టిన రోజుల్లోనే " అన్నాడు. "రక్షా నువ్వు బ్లాక్ శారీలో కత్తిలా ఉన్నావు తెలుసా" అని అంది శ్రీముఖి ఆ మాటలకు నవ్వేసింది రక్షా..తర్వాత రవికృష్ణకి కౌంటర్ వేసింది శ్రీముఖి "నువ్వు విరూపాక్షలో మంత్రాలు చదివింది నవ్య మళ్ళీ రావడానికా" అని అడిగేసరికి "ఏ కాదు" అన్నాడు రవి. ఇదంతా ఐపోయాక రవికృష్ణ-నవ్య మంచి హాట్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. జోడీస్ హగ్ చేసుకోండి అని శ్రీముఖి చెప్పేసరికి "నా పక్కన మానస్, అవినాష్ ఇద్దరు ఉన్నారు.. ఎం చేయాలి" అని దీపికా అడిగేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఉస్తాద్ టీమ్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసింది.
![]() |
![]() |